Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల టీఆర్ఎస్ పార్టీ సంయుక్త కార్యదర్శి కెల్లా శేఖర్, టీడీపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కెల్లా వేణుగోపాల్ మాతృమూర్తి కెల్లా అన్నపూర్ణమ్మ శుక్రవారం మృతి చెందారు. వయస్సుపై బడిన అన్నపూర్ణమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. అన్నపూర్ణమ్మ బౌతికకాయాన్ని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అన్నె సత్యనారాయణ మూర్తి, ప్రధానకార్యదర్శి కణితి రాముడు, అధికారప్రతినిది జానీపాషా, ప్రచార కమిటీ అధ్యక్షుడు దామెర్ల శ్రీనివాస్, యువజన విభాగం అధ్యక్షుడు లంకా శివ సీనియర్ నాయకులు కొత్తూరి సీతారామారావుతో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లంక శ్రీనివాసరావు, టిడిపి మండల అధ్యక్షులు కొమరం దామోదర్ రావులతో పాటు సీపీఐ(ఎం) నాయకులు సందర్శించి నివాళులు అర్పించడం తోపాటు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు.