Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తగూడెం కళామతల్లి ముద్దుబిడ్డ జికే
- లెహరాయి చిత్రం ఆడియో పోస్టర్ విడుదల
నవతెలంగాణ-కొత్తగూడెం
మెలోడి మాస్టర్ ఘంటాడి కృష్ణ (జికే) సంగీత సృష్టి ''లెహరాయి'' చిత్రంలోని పాటలని, విడుదల అయిన ఆడియో సంగీత ప్రియులను అలరిస్తుందని, చిత్ర పరిశ్రమలో కొత్తగూడెం కళామతల్లి ముద్దుబిడ్డ (జికే) ఘంటాడి కృష్ణ మరో సంచలనం చేస్తారని ప్రముఖ కవి, సినీ గీత రచయిత, సమాజ సేవకులు డాక్టర్ మద్దెల శివకుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక పీఆర్ పంక్షన్ హాల్లో జరిగిన ఆడియో పరిచయ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముందుగా లెహరాయి ఆడియో పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కొత్తగూడెం ముద్దు బిడ్డ మెలోడి మాస్టర్ ఘంటాడి కృష్ణ సంగీత స్వరపరిచిన నూతన చిత్రం లెహ రాయి నుండి విడుదలైన నూతన గీతం ''గుప్పెడంత గుండెల్లో న ఉంటావే... పాట లక్షలాది మంది సంగీత ప్రియులను అలరిస్తుందని తెలిపారు. గతంలో ఆయన అనేక చిత్రాలకు అందించిన సంగీతంలో ఆయా చిత్రాలు విజయాలు నమోదు చేసుకున్నాయని తెలిపారు. సంపంగి, సిక్స్టీన్ (16), శ్రీరామచంద్రుడు, ప్రేమలో పావని కళ్యాన్, బ్యాక్ టూ బ్యాక్, తదితర చిత్రాలు హిట్ చిత్రాలుగా నిచిచాయని తెలిపారు. దాదాపు 65 సినిమాలకు పైగా తన సంగీత సారథ్యంలో మధురమైన సంగీతాన్ని మధురమైన పాటలను మనకు అందించారని తెలిపారు. తాజాగా ఘంటాడి సంగీత సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న నూతన చిత్రం లెహరాయి నుండి ఇటీవల హీరో కార్తికేయ చేతులమీదుగా విడుదలైన అద్భుతమైన మెలోడీతో కూడిన నూతన గీతం గుప్పెడంత గుండెల్లో ఉన్న ఉంటావే ను నూతన హీరో, హీరోయిన్ రంజిత్ మరియు సౌమ్య మీనన్లపై చిత్రీకరించగా ఈ పాటను ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి రాయగా ప్రముఖ సినీ నేపథ్య గాయకులు జావేద్‌అలీ ఆలపించారని తెలిపారు. ఎస్ఎల్ఎస్ మూవీస్ పతాకంపై బెక్కంటి వేణు గోపాల్ సమర్పణలో మద్ది రెడ్డి శ్రీనివాస్ నిర్మాతగా రామకృష్ణ పరమహంస దర్శకులుగా, ఘంటాడి సంగీత సారథ్యంలో రూపుదిద్దుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఘంటాడి కృష్ణ ఫోన్లో లైవ్‌లో మీడియాతో మాట్లాడించారు. నా తదుపరి చిత్రాలలో కొత్తగూడెం గాయకులు అల్లి శంకర్‌కు గాయకుడిగా అవకాశం అవకాశాలు అందిస్తానని తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో సింగర్ ఆఫ్ సింగరేణి అల్లి శంకర్, జానపద బ్రహ్మ డాక్టర్ బొమ్మ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డి-10 కొరియోగ్రాఫర్ తాటి కార్తీక్, ఉప సర్పంచ్ రవి, అజరు తదితరులు పాల్గొన్నారు.