Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
ఇండియన్ రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని గుర్రాలపాడు గ్రామ రైతులకు శుక్రవారం టార్ఫాలన్ పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ జిల్లా చైర్మన్ వెలిగోటి చంద్రమోహన్ మాట్లాడుతూ గుర్రాలపాడు గ్రామంలో సన్న, చిన్న కారు రైతులు 20 మందికి టార్ఫాలన్ పట్టాలు అందజేయడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో సంస్థ ఆధ్వర్యంలో మరెన్నో బృహత్తర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు శ్రీహరి, ముజీబ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు బొల్లం వెంకన్న, బుర్ర వెంకటేశ్వర్లు, బుర్ర మహేష్, దొడ్డ వెంకటప్పయ్య, శ్రీను, వెంకన్న, తీగల నాగరాజు పాల్గొన్నారు.