Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్దఎత్తున హాజరవుతున్న ప్రజలు
నవతెలంగాణ- ఖమ్మం
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఖమ్మంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో ప్రజలు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. శుక్రవారం ఖమ్మం త్రీ టౌన్ ప్రజా సంఘాల సిఐటియూ, టియుడిఎఫ్, డివైఎఫ్ఐ, ఐద్వా ఆధ్వర్యంలో ఖమ్మం మున్సిపాలిటీ కార్పొరేషన్ కార్యాలయం ముట్టడించారు. ఇందులో టియుడిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డీజీ నరసింహారావు, త్రీ టౌన్ ప్రజాసంఘాల కన్వీనర్ భూక్యా శ్రీనివాస్‌రావు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరావు, సీఐటీయూ రాష్ట్ర నాయకులు యర్రా శ్రీకాంత్, ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి, జిల్లా నాయకులు వై.విక్రమ్, ఎంఏ జబ్బార్, ఎస్ నవీన్‌రెడ్డి, టియుడిఎఫ్ జిల్లా కార్యదర్శి యర్రా శ్రీనివాస్‌రావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అఫ్రోజ్ సమీనా, ఆవాజ్ జిల్లా నాయకులు ఎంఏ ఖయ్యుం, టియుటిఎఫ్ నాయకులు బోడ పట్ల సుదర్శన్, 35వ డివిజన్ కార్పొరేటర్ వెల్లంపల్లి వెంకట్రావు, డివైఎఫ్ఐ ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి శీలం వీరబాబు, ఐద్వా త్రీ టౌన్ కార్యదర్శి పత్తిపాక నాగ సులోచన, ప్రజా సంఘాల నాయకులు ఎస్ కే సైదులు, సారంగి పాపారావు, రంగు హనుమంత చారి, గబేటి పుల్లయ్య, మద్దెల పుల్లారావు, పి.రామకృష్ణ, భూక్య సుభద్ర, నాయని నరసింహా రావు మోటమర్రి జగన్మోహన్ రావు, మట్టి పల్లి వెంకన్న, శ్రీశైలం, కృష్ణ, పిరయ్య, రామకష్ణ, మీనాల మల్లికార్జున్, పాశం సైదమ్మ, జిబి చౌదరి, నాగవరపు లలిత, సునీత ,పునయ, ఎస్కే అమీనా తమ్మినేని రంగారావు పండగ వెంకన్న కన్నా కన్నెగంటి శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.