Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి
నవతెలంగాణ- ఖమ్మం
విద్యార్ధులు కలలను సాకారం చేసుకోవాలని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవాలని, దేశానికి అవసరమైన ఆవిష్కరణలను చేయాలని ఖమ్మం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్ అన్నారు. తెలంగాణ ప్రజా సాంస్కతిక కేంద్రం,జన విజ్ఞాన వేదిక సంయుక్తంగా నిర్వహించిన ''వేసవి శిబిరం ''ముగిసింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు చిన్నారులకు దేశభక్తిి గీతాలు, వివిధ రకాల ఆటలు డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు . ఇలాంటి సమ్మర్ క్యాంపులు వలన విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత వెలికితీసేందుకు ఎంతగానో ఉపయోగపడ తాయని తెలిపారు. అనంతరం వేసవి శిబిరంలో పాల్గొన్న పిల్లలకు బహుమతులు, సర్టిఫికేట్లు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లావణ్య, 25 డివిజన్ కార్పొరేటర్ గోళ్ళ చంద్ర కళ , నిర్మల్ హృదరు పాఠశాల పరిపాలన అధికారి బి వి అర్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు రాములమ్మ, రాష్ట్ర కార్యదర్శి ఏ.నాగేశ్వరరావు, ఎల్ వి రెడ్జి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివ నారాయణ, రామారావు, కన్వీనర్ డాన్ బొస్కో, వీర నారాయణ, టీ.రామకృష్ణ, టీపిఎస్ఎస్ కన్వీనర్ పి.ఝాన్సీకుమారి, మాలతి, భారతి, రుపా రుక్మిణి, శర్మ, లక్ష్మీనారాయణ, ఏసొబు, శ్రీదేవి, మల్లిక తదితరులు పాల్గొన్నారు.