Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రథమ వర్ధంతి సభలో పలువురు వక్తల ఘన నివాళి
నవతెలంగాణ-ఖమ్మం
నిజాయితీ, నిబద్దతలకు నిలువుటద్దం కోదాటి దశరథ జీవిత క్రమమని శుక్రవారం నిర్వహించిన కోదాటి దశరథ ప్రధమ వర్ధంతి సభ లో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు, వ్యాపార ప్రముఖులు పేర్కొంటూ ఘన నివాళులు అర్పించారు. సీపీఎం నాయకులు, ఆల్ పెన్షనర్స్ జిల్లా ఉపాధ్యక్షులు కోదాటి దశరథ గత ఏడాది కోవిడ్‌తో మృతి చెందగా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక మంచికంటి ఫంక్షన్ హాల్ ఆల్ పెన్షనర్స్ రాష్ట్ర కార్యదర్శి మచ్చా రంగయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రముఖ వ్యాపారవేత్త మధుకాన్ గ్రానైట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నామ కృష్ణయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఎం జిల్లా నాయకులు బుగ్గవీటి సరళ, కళ్యాణం వెంకటేశ్వరరావు, బండి రమేష్‌లు పాల్గొని నివాళులు అర్పించి ప్రసంగించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డిజీ. నర్సింఘరావు, జిల్లా నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, ఎర్రా శ్రీకాంత్, అఫ్రోజ్ సమీనా, సూడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, కార్పొరేటర్ కమర్థపు మురళి, కుటుంబ సభ్యులు భార్య కనకదుర్గ, కుమారులు కోదాటి గిరి, శ్రీనివాస్ రావ్, కూతురు కొల్లు పద్మ, అల్లుడు మాధవరావు, మనవళ్లు, మానవరాళ్లు, బంధు మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.