Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-వధూవరులకు నూతన వస్త్రాల బహుకరణ
-కార్యకర్తల కుటుంబాలకు ఓదార్చు, ఆర్థిక సహాయం
వేంసూరు : వేంసూరు మండలంలో విస్తతంగా పర్యటించిన మాజీ ఎంపీ పొంగులేటి శుక్రవారం ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేంసూరు మండలంలో పలు గ్రామాల్లో పర్యటించారు. బీరాపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన చర్చి ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. జయలక్ష్మిపురం, అడసార్లపాడు, వైయస్ బంజర, చౌడవరం, మర్లపాడు కాలనీ, వెంకటాపురం, మొద్దులగూడెం గ్రామంలో జరిగిన పలు వివాహా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వధూవరులకు నూతన వస్త్రాలు బహూకరించారు.
పెనుబల్లి : మండాలపాడు గ్రామంలో శుక్రవారం పగిడల శ్రీనివాసరావు కుమారుని వివాహం సందర్భంగా వారి ఇంటి వద్ద ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెళ్లి కుమారుడిని దీవించి నూతన వస్త్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
కొణిజర్ల : ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం కొణిజర్ల మండలం కేంద్రంలో బెజవాడ సామేలు కుమారుని వివాహ మమోత్సవంలో పాల్గొని దంపతులను దీవించి శుభాకాంక్షలు తెలిపారు. వధూవరులకు నూతన వస్త్రాలను అందజేశారు.
ఖమ్మం : శుక్రవారం ఖమ్మం నగరంలో మాజీ పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. భక్త రామదాసు కళాక్షేత్రంలో రైట్ ఛాయిస్ నిర్వాహకులు మెండెం కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వెయ్యి మంది విద్యార్థులతో ఏర్పాటు చేసిన సెమినార్ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి పాల్గొన్నారు. ఎంతో మంది విద్యార్ధులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన రైట్ ఛాయిస్ నిర్వాహకులు మెండెం కిరణ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం బైపాస్ రోడ్ లోని సప్తపది కళ్యాణ మండపంలో జరిగిన పొదిల చిన్న పాపారావు కుమార్తె వివాహమహౌత్సవంలో పాల్గొని పెళ్లి జంటను దీవించి నూతన వస్త్రాలను అందజేశారు.