Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
గత ఐదు సంవత్సరాలుగా ప్రేమ పేరుతో నర్మదను ప్రేమిస్తూ పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకొనని చెబుతున్న కిరణ్ కుమార్ తో పోలీసులు వివాహం జరిపించాలని ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు డి. సీతాలక్ష్మి డిమాండ్ చేశారు. బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన ఇర్ఫా నర్మదను, అదే ప్రాంతానికి చెందిన బోరుగడ్డ కిరణ్ కుమార్ ప్రేమ పేరుతో మోసం చేసి పెండ్లికి నిరాకరించడంతో శనివారం అతని ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనకు ఐద్వా మద్దతు ప్రకటించింది. ఐద్వా నాయకులు స్పందించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కిరణ్ తో పెళ్లి చేయాలని పోలీస్ అధికారులను వారు కోరారు. పోలీసు స్టేషన్ కు పిలిపించి ఇరువురిని కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు డి.సీతాలక్ష్మి మాట్లాడుతూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే మేము దీక్ష విరమిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకులు ఆఫీస్ బేరర్ యన్. లీలావతి, యు. జ్యోతి, గిరిజన సంఘంరాష్ట్ర నాయకులు సున్నం గంగా, జి. జీవనజ్యోతి ,పాపినేని సరోజిని,జి. రాధా, రమణ, చుక్కమ్మ , వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ దీక్షకు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి, మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మద్దతు తెలిపారు.