Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళన చెందుతున్న లబ్దిదారులు
నవతెలంగాణ-అశ్వారావుపేట
ప్రభుత్వం పేదలకు నెలవారీ అందజేసే బియ్యంలో ప్లాస్టిక్ పోలిన గింజలు రావడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురి అవుతున్నారు. మండల పరిధిలోని నారాయణపురం ప్రభుత్వం చౌక దుకాణం నారాయణపురం కాలనీ నివాసి వనం సరస్వతి శనివారం బియ్యం స్వీకరించింది. ఇంటికి వచ్చాక బియ్యంలో అన్య పదార్ధాలను (రాళ్ళు, తాలు) వేరు చేసే క్రమంలో కొన్ని గింజలు ప్రత్యేకంగా గోచరించాయి. వీటిని మొత్తం సేకరించి ఒక చోట చేర్చి పంటితో కొరికి చూస్తే బంకలా సాగినట్లు అనిపించడంతో గ్రామంలో యువకులకు సమాచారం ఇచ్చింది. వీటిని నీళ్ళలో నానబెట్టి నా మెత్తబడలేదని వారు తెలిపారు. దీంతో గ్రామంలో మరి కొందరి బియ్యంలోనూ వీటిని పోలిన గింజలు కనిపిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు.