Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్
- గాయత్రి డిగ్రీ కళాశాల ఫేర్వెల్ డే వేడుకలు
నవతెలంగాణ-ఖమ్మం
విద్యార్థులు ఆట పాటలతో పాటు సాహిత్యం కలిగి ఉండాలని సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. శనివారం ఖమ్మంలోని గాయత్రి డిగ్రీ కళాశాల ఫేర్వెల్ డే వేడుకలను భక్త రామదాసు కళాక్షేత్రంలో ప్రిన్సిపల్ అండ్ సెక్రటరీ సునీల్ కుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ విద్యార్థులు ఆట పాటలతో పాటు సాహిత్యం కలిగి ఉండాలని, అలాగే క్రమశిక్షణతో మెలిగి దేశ భవిష్యత్తును, మంచి సమాజాన్ని నిర్మించే విధంగా దేశ సంస్కృతిని కాపాడాలని అన్నారు. మువ్వా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు, కాలేజ్ కి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని , భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకోవాలన్నారు. కేయూ రిటైర్డ్ కమతేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని కోరారు. అనంంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు విశేషముగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ జూనియర్ కళాశాల జిల్లా అధ్యక్షులు వీరారెడ్డి, కళాశాల డైరెక్టర్ కుటుంబరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.