Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్
నవతెలంగాణ-ఖమ్మం
అఖిల భారత కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో విడుదల చేసిన వరంగల్ డిక్లరేషన్‌పై అన్ని నియోజకవర్గ, మండల, బూత్ స్థాయిలలో విస్తృతంగా ప్రచారం చేసి రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా నెరవేర్చిందని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఏకైక దమ్మున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని అన్నారు. ప్రజా శ్రేయస్సుకు ఎన్ని అడ్డుంకులు ఎదురైనా ఎదురొడ్డి నిలబడి ప్రజలకు మెరుగైన పాలన అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందని అన్నారు. గతంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన ఏ ప్రభుత్వాలు ఎక్కువ కాలం అధికారంలో ఉండలేక పోయాయని, హామీలిచ్చి ప్రజలను ప్రలోభాలకు గురి చేశారే తప్పా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అన్నారు.నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే తరహా పంథాలో పాలన సాగిస్తున్నాయన్నారు.
విలేకరుల సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు జావేద్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్, ఖమ్మం నగర మాజీ కార్పొరేటర్ వడ్డెబోయిన నర్సింహరావు, సయ్యద్ హుస్సెన్, శంకర్ నాయక్, చోటా బాబా తదితరులు పాల్గొన్నారు.