Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్యంగా పోరాడుదాం హక్కులను సాధించుకుందాం
- సీఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్,
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
హమాలీల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడి సాధించుకుందామని అఖిల పక్ష నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక గుమస్తాల సంఘం భవనంలో అఖిలపక్ష కార్మిక సంఘం ఆధ్వర్యంలో నెల రోజుల నుండి జరుగుతున్నటువంటి కిరాణం జాగిరి హమాలీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కిరాణా హమాలీల అగ్రిమెంట్ తేదీ ముగియడంతో కూలి రేట్ల పెంపు గురించి యజమానులను కోరాం కానీ పరిష్కారానికి యాజమాన్యం ముందుకు రాక చర్చల స్తబ్దత ఏర్పడింది. దీనిని మరిచి హమాలీలపై తప్పుడు ప్రచారం చేయడం సరైనది కాదని ఆల్ ట్రేడ్ యూనియన్స్ నాయకత్వం అభిప్రాయపడ్డారు.
సీఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 28తో కిరాణా హమాలీల కు సంబంధించిన అగ్రిమెంట్ పూర్తయింది. దీనికి సంబంధించి యాజమాన్యం కి లేఖ పూర్వకంగా తెలియజేశారు. యాజమాన్యం 2-3 సార్లు చర్చలు జరిపారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. అనివార్య పరిస్థితులలో ఒకటిన్నర రోజులు హమాలీలు సమ్మె జరిపారు. పెద్దలు జోక్యం చేసుకుని సమ్మె ను విరమింపజేసి చర్చలు ద్వారా పరిష్కారం చేసుకుందామన్నారు. దీనితో హామాలీలు సమ్మె విరమించి విధుల్లో కి వెళ్ళడం జరిగింది. దీనికి మద్దతుగా సిఐటియు, టిఆర్ఎస్కెయు, ఎఐటియుసి, ఐయఫ్టియు ఇతర హమాలి సంఘాలు తమ సంపూర్ణ మద్దతు తెలిపాయి.
ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా కార్యదర్శి బి.జి.క్లేమెంట్చ టిఆర్ఎస్కెవి జిల్లా నాయకులు నున్నా మాధవరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వరరావు, ఐయఫ్టియు జిల్లా కార్యదర్శి జి. రామయ్య, టియుడియఫ్ రాష్ట్ర నాయకులు యర్రా శ్రీనివాస రావు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.