Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిగుమతి మిల్లుల వద్ద జిల్లా రెవెన్యూ, సివిల్ సప్లరు అధికారులు ప్రత్యక్షంగా ఉండాలి
- తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మంత్రి గంగుల కమలాకర్‌కు వినతి
నవతెలంగాణ - వైరాటౌన్
ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మిల్లుల దిగుమతి వద్ద రైతుల సమస్యలను సివిల్ సప్లరు మంత్రి గంగుల కమలాకర్‌కు తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు వివరించారు. యాసంగి సీజన్ వరి ధాన్యం కొనుగోలు సందర్భంగా ఒక్క కేజీ కూడా మిల్లర్లు కటింగ్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు బాధ్యత తీసుకుంటామని బహిరంగ ప్రకటనలు చేయడం తప్ప ఆచరణలో మిల్లర్ల కటింగ్ అదుపు చేయడానికి ప్రయత్నాలు లేవని బొంతు రాంబాబు అన్నారు. శనివారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు, మిల్లుల వద్ద రైతులు ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేస్తూ వైరా వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలనకు వచ్చిన రాష్ట్ర సివిల్ సప్లరు శాఖ మంత్రి గంగుల కమలాకర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ కు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మిల్లర్లు చేస్తున్న అక్రమ ధాన్యం కటింగ్‌ను బొంతు రాంబాబు రైతులతో కలిసి మంత్రులకు వివరించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తేమశాతం పరిశీలించి అధికారులు దవీకరణ చేసిన తర్వాత రైతుకు ఎగుమతి, దిగుమతితో సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా మిల్లర్లు మాత్రం క్వింటాళ్లకు 10 కేజీల కటింగ్‌కు అంగీకరించిన రైతుల ధాన్యాన్ని మాత్రమే దిగుమతికి అనుమతి ఇస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయల నష్టం భరించి యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు చేస్తుందని, వాస్తవానికి నూకలు ఎక్కువ పేరుతో మిల్లర్లు కటింగ్ అదుపు తప్పి పోయిందని, దీనివలన రైతులకు ఎక్కువ నష్టం జరుగుతుందని వివరించారు. మిల్లుల వద్ద రెవెన్యూ, సివిల్ సప్లరు అధికారులు ఉండి ధ్యానం దిగుమతి వేగవంతం చేయాలని, రైతులను ఆదుకోవాలని కోరారు. తరగు, నూకలు పేరుతో కటింగ్ చేసిన మిల్లులను సీజ్ చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు వైరా మున్సిపాలిటీ పరిధిలోని లాలాపురం గ్రామం సమీపంలో ఉన్న రైస్ మిల్లును సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్‌కు సివిల్ సప్లరు మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు మల్లెంపాటి రామారావు, నాయకులు వాసిరెడ్డి విద్యా సాగర్ రావు, బెజవాడ వీరభద్రం, సుంకర సుధాకర్, తోట నాగేశ్వరావు, యనమద్ధి రామకృష్ణ, బాజోజు రమణ, పారుపల్లి కృష్ణారావు, అనుమోలు రామారావు, బాల్లెపోగు శ్రీనివాసరావు, చిత్తారు మురళి, సూరయ్య, అశోక్, నాగయ్య పాల్గొన్నారు.