Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కమిటీ సభ్యులు బి.ప్రసాద్
నవతెలంగాణ-చింతకాని
గ్రామీణ ఉపాధి హామీ కూలీలు 20 లేదా అంతకంటే ఎక్కువ మంది మస్టర్ రోల్స్ జారీ చేసిన అన్ని వర్క్సైట్లలో అటెండన్స్ నేషనల్ మానిటరింగ్ మస్టర్ రోల్ సిస్టమ్ ఎన్ఎంఎంఎస్ ద్వారా తప్పనిసరిగా క్యాప్చర్ చేయాలనే నిర్ణయంను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కమిటీ సభ్యులు బి ప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం జిల్లా చింతకాని మండల సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు సార్లు పని ప్రదేశంలో కూలీల ఫొటోలు ఆన్లైన్ లో అప్లోడ్ అయితేనే చేసిన పనికి వేతనాలు ఇవ్వాలనే నిర్ణయం ఉపాధి హామీ చట్టం మౌళికాంశానికి విరుద్ధమైనది అన్నారు. తప్పనిసరిగా అన్ని గ్రామ పంచాయతీల్లో మేట్లు 100శాతం అటెండన్స్ అప్లోడ్ చేసే విధంగా చూడాలని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఫొటోలు రెండు సార్లు పని ప్రదేశంలోనే తీసి డైరెక్ట్ గా అప్ లోడ్ చెయ్యాలి. లేకుంటే పైసలు పని చేసినా రావు అన్నారు.రోజు మొత్తం పని ప్రదేశంలోనే కూలీలు ఉండాల్సిందే ఆటో మేటిక్‌గా కూలీలు పనికి రాము అని వెళ్లి పొయ్యేటట్లు ప్రభుత్వం చెయ్యజూస్తున్నది. ఇప్పటికే క్యూబిక్ మీటర్లు కొలతలు పేరుతో వేతనం పడకుండా చేస్తున్నారని, చేసిన పనికి వారంలో వేతనాలు ఎక్కడా రావడం లేదని, పని ప్రదేశంలో నీడకు టెంట్, తాగడానికి మంచి నీళ్ళు, మెడికల్ కిట్, పనిముట్లు ఇవ్వకుండా కూలీలను పనికి దూరం చేస్తున్నారన్నారు. తక్షణమే ఈ నిర్ణయంను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు, సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వత్సవాయి జానకి రాములు, సీఐటియు జిల్లా నాయకులు మడిపల్లి గోపాల్ రావు, గడ్డం రమణ, దేశ బోయిన ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.