Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం లీగల్
జిల్లా జైలులోని పలువురు ఖైదీలు తమకున్న అనారోగ్యం పట్ల ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఖైదీల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఖమ్మం జిల్లా న్యాయసేవాధికార సంస్థ న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ జావేద్ పాషా జైలు అధికారులకు సూచించారు. శనివారం ఉదయం న్యాయమూర్తి జిల్లా జైలును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రతి బ్యారక్ పరిశీలించి ఖైదీలతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో పలువురు ఖైదీలు తమకున్న అనారోగ్యం విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకొని వచ్చారు. తదనంతరం న్యాయమూర్తి జిల్లా జైలులోని ఫార్మసీని సందర్శించారు. ఫార్మసీ లో మందులు తగినంతగా ఉన్నాయి కానీ అవి అందివ్వడానికి వైద్యుడు లేడని జైలు అధికారులు న్యాయమూర్తి దృష్టికి తీసుకొని వచ్చారు. అనంతరం న్యాయమూర్తి న్యాయ సహాయం, బెయిలు, షూరిటీ, తదితర అంశాలను వివరించారు. న్యాయ సేవా సంస్థ ఛానల్ న్యాయవాదులు మద్దినేని నాగేశ్వరరావు, భాష మరియు జైలు సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.