Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం రాపర్తి నగర్ ప్రాంతానికి చెందిన పాపినేని సుధీర్ కుమార్ అనే నిరుపేద కుటుంబానికి తానా ఆధ్వర్యంలో రూ. 2లక్షల70 వేలు విలువైన బజాజ్ ఆటోను శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ లబ్ధిదారునికి అందించారు. దాతలు నమ్మకంతో అందించిన సాయాన్ని కుటుంబ పోషణకు పిల్లల చదువుకు ఉపయోగించాలని, సాయాన్ని అందించిన తానా బృందాన్ని ఆయన అభినందించారు. చింతకాని మండలం నాగులవంచకు చెందిన పాపినేని సుధీర్ డిగ్రీ చదివి ఉపాది కొరకు ఖమ్మం చేరుకున్నాడు. కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న క్రమంలో ఆక్సిడెంట్‌కు గురై బరువులు ఎత్తటమే కాదు ఎక్కువ సేపు నిలబడలేని స్థితికి చేరుకున్నాడు. డ్రైవింగ్ తెలిసినా పనులు దొరక్క చివరకు సామినేని నాగేశ్వరరావు ద్వారా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) వారిని అభ్యర్ధించాడు. ఈ క్రమంలో రవి సామినేని సహాయాన్ని కోరగానే , తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, సామినేని ఫౌండేషన్, తానా ఫౌండేషన్ సంయుక్తంగా రెండున్నర లక్షలతో ఒక బజాజ్ ఆటో కొని అందజేశారు. కార్యక్రమంలో బండి నాగేశ్వరరావు, వాసిరెడ్డి అర్జునరావు, పారుపల్లి రామలింగేశ్వర రావు, విజయ, సుధాకర్, విజరు కుమార్, పాటిబండ్ల తదితరులు పాల్గొన్నారు.