Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ గెలుపే లక్ష్యం
- పట్టణ అధ్యక్షులు మల్లి ఖార్జున్
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వర్గపోరు లేదని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కలిసి కట్టుగా కృషి చేస్తామని కొత్తగూడెం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్మిడి మల్లి ఖార్జున్ స్పష్టం చేశారు. శనివారం స్థానిక రైటర్ బస్తిలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, ఇక్కడ వర్గపోరు లేదని, కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఇటీవల వరంగల్ సభలో మాజీ ఏఐసీసీ అద్యేక్షులు రాహుల్ గాంధీ చాలా క్షుణ్ణంగా తెలిపారని, కష్టపడ్డ వారికే టికెట్, ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు పరిష్కరించే వారికి పదవులు దక్కుతాయని పార్టీని భ్రష్టు పట్టించే వారిని బహిష్కరిస్తామని తేల్చి చెప్పారని గుర్తుచేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో 40వేల సభ్యత్వాలు చేసి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి రూ.10 లక్షలు అందించిన ఘనత దక్కిందని తెలిపారు. ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా, తెలియని వ్యక్తులు ప్రజలకు మాయ మాటలు చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు శాంతయ్య, చుంచుపల్లి మండల అధ్యక్షులు అంథోటిపాల్, గిన్నారపు నాగేందర్, వెంకటేశ్వర్లు, రమేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.