Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొగ్గు గని కార్మిక నేతకు సీఐటీయూ నివాళ్లు
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణిలో కార్మిక సమస్యలు, కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా కార్మిక నేత చేసిన అనేక ఉద్యమ త్యాగాలు కార్మికులు ఏనాటికీ మరిచిపోలేరని బొగ్గు గని కార్మిక నేత జార్జ్‌కు సీఐటీయూ నాయకులు నివాళులు అర్పించారు. శనివారం మున్సిపల్ పరిధిలోని రామవరంలో సింగరేణి బొగ్గు గని కార్మికుల్లో సీఐటీయూ అనుబంధ సంఘం సింగరేణి కాలరీస్ ఎంప్లాయూస్ యీనియన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన కామ్రేడ్ కె.జార్జ్ 30వ వర్థంతి సందర్భంగా జార్జ్స్తూపం వద్ద సీఐటీయూ నేతలు జెండా ఎగురవేసి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్థూపం వద్ద కొత్తగూడెం బ్రాంచి కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు మాట్లాడుతూ కార్మిక నేత ఉద్యమ త్యాగాలను ఆయన నిబద్ధతను గుర్తు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే.రమేష్ మాట్లాడుతూ కాంట్రాక్టీకరణ రద్దు కోసం ఆనాటి నేత జార్జ్ పోరాడారో అది తిరిగి బీజేపీ ప్రభుత్వం హయాంలో వేగవంతం అవు తుందని అన్నారు. ఈ కార్య క్రమంలో గాజుల రాజారావు, వై.వెంకటేశ్వరరావు, యర్రగాని కృష్ణ య్య, మేకల రాయమల్లు, గడల నరసింహారావు, ఎంఎస్. ప్రకాష్, పప్పుల వెంకటి, భూక్య రమేష్, బాలరాజు, వీరన్న, నగేష్, కెహెచ్ ప్రసాద్, శ్యామ్, మహ్మద్ అలీ, సతీష్, తదితరులు పాల్గొన్నారు.