Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (హెచ్-142) కేటీపీయస్7వ దశ రీజినల్ సెక్రటరీగా షేక్ సయ్యద్ ఎన్నికయ్యారు. ఈ మేరకు కేటీపీఎస్ కాలనీలో ఉన్న యూనియన్ కార్యాల యంలో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.రామారావు ముఖ్య అధితిగా పాల్గొని... కేటీపీయస్ 7వ దశలో డ్రైవర్ గ్రేడ్-1గా పనిచేస్తున్న షేక్ సయ్యద్‌ను ప్రాంతీయ కార్యదర్శిగా ఎన్నుకుని, నియామక పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈ సందర్బంగా సయ్యద్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇంత పెద్ద భాద్యత అప్పగించిన రామారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పబ్బు శ్రీహరి, సుమన్, శ్రీనివాసరావు, శివరాం తదితరులు పాల్గొన్నారు.