Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి కల్యాణ వెంకటేశ్వరరావు
నవతెలంగాణ- ఖమ్మం
జిల్లాలో 19న జరిగే బంద్ విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కల్యాణ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం ఖమ్మంలోని మంచికంటి భవన్లో సిఐటియు జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్ అధ్యక్షతన ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జేఏసి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశంలో అయన మాట్లాడుతూ ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించాలని, అలాగే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను జిఎస్టి పరిధిలో కలిపి ధరలను తగ్గించాలని, రవాణా శాఖలో పెంచిన సర్వీస్ ఛార్జీలు ఫిట్నెస్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్కెవి జిల్లా అధ్యక్షులు పాల్వంచ కృష్ణ, ఏఐటీయూసీ నాయకులు పి.మోహన్రావు, ఐఎఫ్టియు నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈనెల 19వ తేదీన ట్రాన్స్పోర్ట్ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆటో, కార్, ట్రాక్టర్, లారీ, డిసిఎం, జెసిబి, అలాగే టాటా మ్యాజిక్ గూడ్స్, ఆటో బంద్ చేయాలని, అదే రోజు ఖమ్మం రవాణా శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసి ముట్టడి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా ఉపేందర్, సిఐటియు జిల్లా నాయకులు నవీన్ రెడ్డి, కారు యూనియన్ నాయకులు బొట్ల విద్యాసాగర్, యాక్టింగ్ కార్ డ్రైవర్ సీరియల్ జిల్లా ప్రెసిడెంట్ కృష్ణారావు, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం.అమరయ్య ఆటో యూనియన్ నాయకులు వేమ శ్రీనివాసరావు, డ్రైవర్లు రమేష్, నాగేశ్వరరావు, శ్రీను, ఆటో డ్రైవర్లు ట్రాన్స్పోర్ట్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.