Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజావాణిలో కలెక్టర్‌కు యాకూబ్ పాషా ఫిర్యాదు
పాల్వంచ : తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా 10వ తరగతి ఉర్దూ మీడియంలో జిల్లాలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్నా నేటి వరకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయలేదని పాల్వంచకు చెందిన భద్రాద్రి జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్‌కు ఫిర్యాదు చేసారు. అనంతరం యాకూబ్ పాషా మాట్లాడుతూ ఉర్దూ మదర్సాలలో ఇస్లాం ధార్మిక విద్యను ఆబ్యసిస్తున్న విద్యార్థులకు ఈ నెల 29 తేదీనుండి పదవ తరగతి వార్షిక పరీక్షలు ఖరారైనప్పటికీ నేటి వరకు సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పాఠ్య పుస్తకాలు అందకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని ఇట్టి విషయాన్ని సంబంధిత శాఖ ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినప్పటికీ స్పందన కరువైందన్నారు. ఈ విషయమై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి కలెక్టర్ ఆదేశించినట్లు యాకూబ్ పాషా తెలిపారు.