Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులైన పేదవారికి ఇంటి స్థలాలు, డబుల్ ఇండ్లు కేటాయించాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-మణుగూరు
పినపాక నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు గుర్తించి, అర్హులైన పేద అందరికి పంచి పెట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. సోమవారం స్థానిక శ్రామిక భవన్లో నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొని, మాట్లాడుతూ పేదలకు పంచిన తర్వాత మిగులు భూములను కబ్జా గురికాకుండా నియోజకవర్గ అధికారులు కాపాడాలన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని, అధికారులను లోబర్చుకుని కొందరు భూమి కబ్జా చేస్తున్నారన్నారు. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. అది సరైన పద్ధతి కాదని భవిష్యత్తులో ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గంలో పోడు భూములలో ఫారెస్ట్ అధికారులు కందకాలు తీస్తూ పోడు సాగు దారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నార న్నారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు కందకాలు తీయకుండా ఆపాలని డిమాండ్ చేశారు. ఫారెస్ట్ అధికారులు నాయకుల భూములు కాపాడుతు న్నారని పేదవాడి భూములను లాక్కున్నారని అన్నారు. సీతమ్మ సాగర్ భూ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ధరలు పెంచుతున్నా యన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బస్ చార్జీలు పెంచడం దారుణమన్నారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు అన్నవరం సత్యనారాయణ, నిమ్మల వెంకన్న, గద్దల శ్రీనివాసరావు, మండల కార్యదర్శులు కోడిశాల రాములు, బత్తుల వెంకటేశ్వర్లు, కొమరం కాంతారావు, పాయం నరసింహారావు, నాయకులు శివ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.