Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరియం కోటేశ్వరరావు
నవతెలంగాణ-భద్రాచలం
సుందరయ్య కాలనీలో డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని ఆపాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి సరియం కోటేశ్వరరావు అన్నారు. భద్రాచలం ఐటీడీఏ ఎదురుగా దీక్ష చేస్తున్న కాలనీ వాసులకు, గోండ్వానా సంక్షేమ పరిషత్ సంఘానికి మద్దతుగా సోమవారం టీఏజీఎస్ దీక్షలో పాల్గొని మద్దతు ప్రకటించింది. ఈ దీక్ష కార్యక్రమానికి సోయం జోగారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కోటేశ్వ రరావు, రాష్ట్ర కమిటీ సభ్యురాలు, సున్నం గంగలు మాట్లాడుతూ సుందరయ్య కాలనీ ఆదివాసులు నివసిస్తున్నటువంటి శివారు కాలనీగా ఇప్పుడిప్పుడే గృహాల నిర్మాణం చేసుకుని క్షేమంగా ఆరోగ్యంగా ఉంటున్నారని తెలిపారు. వారి ఆరోగ్యాలు కాపాడుకోవలసిన ప్రభుత్వ అధికారులపై వుందని పేర్కొన్నారు. హానికరంగా ఉన్నటువంటి ఈ డంపింగ్ యార్డును తక్షణమే జన వాసులకు దూరంగా నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోందె వీరయ్య, గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి, సున్నం గంగ, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు శ్రీను, సోయం జోగా రావు, పద్మ, రామమ్మ, మంగ వేణి, వెంకటలక్ష్మి, తిరుపతమ్మ, భద్రమ్మ, వసుంధర, సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.