Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
తహసీల్దార్ విధివధానాలపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్కు బాధితలు ఫిర్యాదు చేశారు. మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజారావు, చర్ల, సత్యనారా యణపురం పీఏసీఎస్ చైర్మెన్లు పరుచూరి రవికుమార్, ఎంఏ శ్రీనివాసరాజు, మండల రైతు బంధు సమితి కన్వీనర్ కేవీకే రాజా, ఎంపీటీసీ మీడియం శోభారాణి, వివిధ గ్రామాల సర్పంచ్లు తదితరుల ఆధ్వర్యంలో కలెక్టర్ని కలిసి తమ సమస్యలు విన్నవించి, తహసీల్దార్ తీరుపై ఫిర్యాదు చేశారు. ప్రధానంగా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ తన ఇష్టానుసారం వ్యవహరిస్తూ స్థానిక గిరిజనులను తహసీల్దార్ నానా అవస్థలు గురిచేస్తున్నారని ఆ ఫిర్యాదుల పేర్కొన్నట్టు నాయకులు తెలిపారు.