Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీబీజీకేఎస్ వైజ్ ప్రెసిడెంట్ రంగనాథ్
నవతెలంగాణ-ఇల్లందు
జేకే ఓసిలో పనిచేస్తున్న ఓబి కార్మికులను టీబీజీకేఎస్ వైజ్ ప్రెసిడెంట్ ఎస్.రంగనాథ్ సోమవారం కలుసుకున్నారు. గనిలో పనిప్రదేదానికి వెళ్లి ఓబి ఆపరేషన్ జరుగుతున్న తీరును పరిశీలించారు. మస్యలు అడిగి తెలుసుకున్నరు. వారికి కొంతమంది సాప్ (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్) నిభందనలు తెలుగులో అర్థం కావటం లేదని హిందీలో ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ జేకేఓసి ఏరియా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న దన్నారు. అక్సిడెంట్ ఫ్రీ ప్రాజెక్ట్ అని, ఇలాంటి ప్రాజెక్ట్‌లో పనిచేయటం అదృష్టం అని, ప్రతిఒక్కరూ జాగ్రత్తగా విధి నిర్వహించాలని, రక్షణతో కూడిన ఉత్పత్తి మన అందరి లక్షమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ శివప్రసాద్, ఓఎంలు లింకన్, రాంచందర్, ఓబి సూపర్వైజర్లు పాల్గొన్నారు.