Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంక్షేమ శాఖ ట్రైకార్ జీఎం
నవతెలంగాణ-భద్రాచలం
వ్యాపారంలో నైపుణ్యత సాధించి అభివృద్ధి చెందాలని గిరిజన సంక్షేమ శాఖ ట్రైకార్ జీఎం శంకర్రావు అన్నారు. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐటీడీఏ, ట్రైకార్ ద్వారా ఆదివాసి గిరిజన కమ్యూనిటీ సభ్యులకు శిక్షణా కార్యక్రమంలో మాట్లాడారు. సోమవారం ఐటీడీఏలోని గిరిజన మ్యూజియంలో ఏర్పాటు చేసిన గిరిజన వ్యాపారులు, పారిశ్రామి కవేత్తల శిక్షణ కార్యక్రమంలో స్టేట్ మిషన్ మేనేజర్ లక్ష్మీ ప్రసాద్, ఏపీఓ (జనరల్ ) డేవిడ్ రాజ్ విహబ్, వైస్ చైర్మన్ శకుంతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి శిక్షణకు ఆదివాసి చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పడానికి వచ్చిన గిరిజనులకు తగిన సలహాలు సూచనలు ఇచ్చారు. చిన్నతరహా వ్యాపారం చేసుకోవడానికి వ్యాపారులకు బ్యాంకు నుండి రుణ సదుపాయం కల్పించడానికి ఐటీడీఏ, వీహబ్ ద్వారాపై అధికారులతో మాట్లాడి రుణం ఇప్పించడానికి అధికారులు సహకరిస్తారని తెలిపారు. ఆదివాసి గిరిజనులు వ్యాపారం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధిలోకి వచ్చి ముందుకు పోవడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగ పడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ, సురేష్ బాబు, జెడీఎం హరికృష్ణ, ఐటీడీఏ మేనేజర్ ఆదినారాయణ, మాధవి, ఐటీడీఏ సిబ్బంది, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి వచ్చిన ఆదివాసి చిన్న తరహా పరిశ్రమల యజమానులు తదితరులు పాల్గొన్నారు.