Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19న రవాణ బంద్ జయప్రదం చేయండి
- కార్మిక సంఘాల ఐక్యకార్యచరణ కమిటీ పిలుపు
నవతెలంగాణ-కొత్తగూడెం
వెహికిల్ ఫిట్ నేస్ రెన్యూవల్కి ఫెనాల్టీపేరుతో రోజుకు రూ.50లు వసూళ్ళు చేసే దోపిడీ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకాలని కార్మిక సంఘాల ఐక్యకార్యచరణ కమిటీ డిమాండ్ చేసింది. మే19 రవాణ బంద్ కోసం ఏఐటియూసీ కార్యాలయంలో జిరిగిన జేఏసీ సమావేశంలో ఏఐటియూసీ జిల్లా ప్రధానకార్యదర్శి గుత్తుల సత్యనారయణ, సీఐటియూ జిల్లా ఉపాధ్యాక్షులు కె.బ్రహ్మాచారి, ఐఎన్టియూసీ జిల్లా నాయకులు కాలం నాగభూషణం, ఐఎఫ్టియూ జిల్లా నాయకులు పి.సతీస్, ఇఫ్ట్యూ జిల్లా కార్యదర్శి ఎల్. విశ్వనాదం, ఐఎఫ్టియూ జిల్లా కార్యదర్శి కందగట్ల సురేందర్ పాల్గని మాట్లాడారు. పెనాల్టి పేరుతో జరిగే దోపిడికి వ్యతిరేకంగా మే19 జరిగే రాష్ట్ర వ్యాప్త రవాణ బంద్‌ను జయప్రదం చేయాలని పిలువు నిచ్చారు. బంద్ జయప్రదం కోసం ఆటో, కారు అడ్డాలలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని, 17వతేదీన అన్నీ మండల కేంద్రాలలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మల దహనం చేయాలని నాయకులు పిలుపు నిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తముగా కలుసి తీసుకొస్తున్న కొత్త చట్టాల వల్ల జరిగే నష్టం వలన మన వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని తెలిపారు. బడా కార్పొరేట్ కంపెనీల చేతుల్లో మన డ్రైౖవర్లను, ఓనర్ కం డ్రైవర్లను బానిసలను చేసే చట్టాలే ఇవని తెలిపారు. పెరిగిన డీజిల్, పెట్రో ధరలు, పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరలు చూసుకుంటే కుటుంబం నడువని పరిస్థితి నడవలేని పరిస్థితి కనిపిస్తుందని తెలిపారు. రవాణ రంగం కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, ఓవర్ లోడ్ ఫెనాల్టి రూ.1030ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియూ కొత్తగూడెం కన్వీనర్ డి.వీరన్న, నాయకులు భూక్యా రమేష్, ఆటో యూనియన్ నాయకులు రింగు వెంకటయ్య, నాయకులు నందిపాటి రమేష్, ఏఐటియూసీ నాయకులు పిట్టల రామచందర్ తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల రాష్ట్ర జేఏసీ ఈనెల 19న రాష్ట్ర వ్యాప్తంగా రవాణా బంద్ నిర్వహించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం రవాణా బంద్ విజయవంతం చేయాలని కోరుతూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వివిధ ఆటో అడ్డాలలో గ్రూప్ మీటింగ్ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు గద్దల శ్రీనివాసరావు, ఆర్.లక్ష్మి నారాయణ, ఆర్.మధుసూదన్ రెడ్డి, జి.శ్రీనివాస్, ఎం.నాగేశ్వరరావు, అక్కి.నరసింహారావు, ఎన్.రమేష్, ఎండీ.గౌస్, ఆటో యూనియన్ నాయకులు సత్యనారాయణ, సతీష్, బిక్షం, సాంబ, తదితరులు పాల్గొన్నారు.