Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
ఉపాధిహామీ కార్మికుల సమస్యల అధ్యయనంలో భాగంగా సోమవారం జంట కుంట చెరువు పరిధిలో వ్యవసాయ కార్మిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యకాస మండల అధ్యక్షుడు రాయి రాజా మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులవేతనం పెంచాలని, మొబైల్ మానిటరింగ్ సిస్టం ఎత్తివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి తిరుమల రావు, రైతు సంఘం మండల అధ్యక్షులు వేణు, సీఐటీయూ మండల కార్యదర్శ విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.