Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిల్లి బాలరాజు పౌర సన్మానం కార్యక్రమంలో విప్ రేగా
నవతెలంగాణ-మణుగూరు
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కలలు సాకారం కావాలంటే ఉత్తమ అధికారులు అవసరమని ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. మణుగూరు సింగరేణి అతిథిగృహంలో భద్రాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ ప్రధమ సీఈ పిల్లి బాలరాజు ఆత్మీయ పౌర సన్మానం నిర్వహించారు. సింగరేణి జనరల్ మేనేజర్ జక్కం రమేష్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు వి.ప్రభాకర్ రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.అయోధ్య చారి, మణుగూరు, పినపాక లైన్స్ క్లబ్ అధ్యక్షులు నాగేశ్వరరావు, ముక్కు నర్సారెడ్డి, మణుగూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు విజయరావులు మాట్లాడారు. భారతదేశ చరిత్రలోనే నాలుగు సీఓడీలను నిర్వహించిన ఘనత బాలరాజ్కే దక్కుతుందన్నారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీలు పట్టణ ప్రముఖులు, ప్రజలు, అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, సింగరేణిలు, ఏరియా లేడీస్ క్లబ్ సభ్యులు తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిల్లారిశెట్టి హరి బాబు, పిండిగా వెంకట్మయ్య, శ్రీనివాసరావు, లలిత్ కుమార్, కోట శ్రీనివాస్ రావు, డాక్టర్ శశిధర్, డాక్టర్ శేషగిరిరావు, గణేష్ రెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.