Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంకు ప్రభుత్వనికిచిత్తశుద్ది లేదని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్య వీరభద్రం విమర్శించారు. సోమవారం కారేపల్లి మండలం భాగ్యనగర్ తండా పంచాయతీలో సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈసందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ 57 ఏండ్లకు పెన్షన్ ఇస్తానన్నా కేసీఆర్ హామీకి ఏడున్నర ఏండ్లు అయినా ఒక్క పించను కూడా మంజూరు చేయక పోగా వచ్చే పింఛను నెలవారి ఇవ్వలేక పోతున్నారన్నారు. భాగ్యనగర్ తండా -పేరుపల్లి గ్రామాల మధ్య లింక్ రోడ్లు లేక రైతులు అవస్ధలు పడుతున్నారన్నారు. వర్షం వస్తే నడవలేని పరిస్ధితి ఉందని గ్రామస్తులు తమ దృష్టికి తెచ్చారన్నారు. కొత్త రేషన్ కార్డులు లేవు, ఆరోగ్యశ్రీ కార్డులు లేక వైద్యం అందటం లేదన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులకు పట్టక పోవటం విచారకరమన్నారు. సమస్యల పరిష్కారం పోరాటమే మార్గమన్నారు. ఈ సర్వేలో భూక్య తోపియా, వాంకుడోత్ రమేష్, వాంకుడోత్ దళ్ సింగ్, వాంకుడోత్ శంకర్, రాము, రమేష్, లచ్చు, రాంబాబు, హట్య పాల్గొన్నారు.