Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -బోనకల్
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అమెరికాలోని ఫ్లోరిడాలో గల ఎంబ్రీ రైడీల్ ఏరోనాటికల్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఏరోనాటిక్స్ విభాగంలో కర్నాటి కావ్య యూనివర్సిటీ ప్రథమ ర్యాంకు సాధించి తెలంగాణ రాష్ట్రం తో పాటు బోనకల్లు మండల కీర్తిని చరిత్ర పుటల్లోకి ఎక్కించింది. కావ్య తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని రాయన్నపేట గ్రామానికి చెందిన తెలుగుతేజం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కలకోట ప్రాథమిక వ్యవసాయ పరపతి చైర్మన్ కర్నాటి రామ కోటేశ్వరరావు కుమార్తె కర్నాటి కావ్య అమెరికాలోనీ ఫ్లోరిడాలో గల ఎంబ్రీ రైడీల్ ఏరోనాటికల్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఏరోనాటిక్స్ విభాగంలో విద్యను అభ్యసిస్తున్నది. మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఏరోనాటిక్స్ విభాగంలో కావ్య యూనివర్సిటీ ప్రథమ ర్యాంక్ సాధించింది. యూనివర్సిటీ మొదటి ర్యాంక్ సాధించిన కావ్యకు ఎంబ్రీ రైడీల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ పరిశోధకులు సోమవారం అవార్డ్ ప్రదానోత్సవం చేస్తూ కావ్యకు యూనివర్శిటీలో గల డిస్ ప్లే పై శుభాకాంక్షలు తెలిపుతు అభినందించారు. కావ్య అత్యుత్తమ ప్రతిభ కనపరిచే తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తముగా నలుదిక్కుల వ్యాపింప చేసింది. యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించిన కావ్య ను కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్, జెడ్పిటిసి మోదుగు సుధీర్ బాబు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు, సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం అభినందనలు తెలిపారు.