Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కామేపల్లి
కామేపల్లి రైతు వేదికలో మండల స్థాయిలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీలర్లు పాటించవలసిన నియమ నిబంధనలపై మండల వ్యవసాయ అధికారి భూక్యా తారా దేవి ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల వివరాలను స్టాక్ రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలని కోరారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల బిల్ బుక్‌లను తప్పనిసరిగా సర్టిఫికేషన్ చేయించుకోవాలని అన్నారు. రైతులకు లైసెన్స్ ఉన్న మంచి కంపెనీల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అమ్మకాలు చేయాలని కోరారు. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ వ్యవసాయ విస్తరణ అధికారులు పి.వేదిత, బి.జగదీష్, డీలర్లు గట్టి కొప్పుల నారాయణ రెడ్డి , గంగారపు నాగేశ్వరరావు, కట్టా కిషోర్ , భూక్యా బాలాజీ, కందాల ఉపేందర్ రెడ్డి, నరేష్, రవి తదితరులు పాల్గొన్నారు.