Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి త్వరలో నిర్వహించే పల్లె ప్రగతి కార్యక్రమాలలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీల లో అమలు పరచనున్న ప్రత్యేక పనులపై సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస రావు మాట్లాడుతూ. గ్రామాలలో అమలు పరచనున్న పనుల వివరాలను వివరించారు. గ్రామ పంచాయతీలు రాబోవు వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా వ్యాధుల నివారణ చర్యలు గురించి వివరించారు. బాల్య వివాహాలు జరగకుండా నివారించాలని సంబంధిత ప్రజాప్రతినిధులకు అధికారులకు సూచనలు చేశారు. గ్రామీణ క్రీడాస్థలం గురించి ప్రతి గ్రామ పంచాయతీలలో ఒక ఎకరం నుండి ఎకరంన్నర స్థలం గుర్తించవలసిదిగా తెలియజేసారు. ఇవన్నీ కూడా రాబోవు పల్లె ప్రగతి కార్యక్రమాలో జరగాలని తెలి యజేసినారు. ఈ కార్యక్రమంలో తాసిల్దారు తిరుమలచారి, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, డాక్టర్ రాజు, జెడ్పిటిసి కవిత, మూల్పూరి శ్రీనివాసరావు, మొగిలి అప్పారావు, కిషోర్ బాబు, వివిధ గ్రామ పంచాయతీల ఎంపీటీసీలు సభ్యులు, గ్రామ పంచా యతీల సర్పంచ్ లు, గ్రామ పంచాయితీ కార్యదర్శు లు పాల్గొన్నారు.