Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్లూరు
మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడి తమ విలువైన ప్రాణాలను తీసుకోవద్దని, చట్టాన్ని ఉల్లంఘించి మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని కల్లూరు ఎస్సై కె.వెంకటేష్ హెచ్చరించారు. ఆదివారం రాత్రి కల్లూరు పట్టణంలో వివిధ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టారు. ఇటీవల మండల పరిధిలో వరుస రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు యువకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మద్యం సేవించిన యువకులు అతి వేగంగా వాహనాలు నడుపుతు ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తున్నారని పలువురు ప్రజాప్రతినిధులు ఎస్సై వెంకటేష్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పది మంది యువకులపై ఎస్ఐ కేసులు నమోదు చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఎస్సై వెంట హెడ్ కానిస్టేబుల్ రామారావు, ప్రసాద్, అశోక్ లు పాల్గొన్నారు.
22న ఖమ్మంలో మినీ మహానాడు.