Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏసీ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి
నవతెలంగాణ-ఇల్లందు
ఏరియా సింగరేణి ప్రధాన ఆసుపత్రిని ఏరియా జీఎం ఎం.షాలేము రాజు సోమవారం పర్యటించారు. ఈ సందర్బంగా జీఎం ఆసుపత్రిలోని మేల్, ఫిమేల్ వార్డులు, ఈసీజీ, రక్త పరీక్ష కేంద్రం, మెడికల్ స్టోర్ మొదలైన విభాగాలను సందర్శించారు. ఆసుపత్రి సిబ్బందితో నిర్వహిస్తున్న విధులకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా నూతనంగా మేల్, ఫిమేల్ వార్డులలో ఏర్పాటు చేస్తున్న ఏసీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పర్యటనలో ఏరియా యస్వోటు జీఎం బండి వెంకటయ్య, ఆసుపత్రి ఇన్చార్జ్ సీఎంఓ డా.రాజశేఖర్, మెడికల్ సూపరిండెంట్ డా.విక్రం, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.