Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక సంఘాల జేఏసీ పిలుపు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఫిట్నెస్ రెన్యువల్‌పై రోజుకు రూ.50లు పెనాల్టీ రద్దు కోసం, ఈ నెల 19న జరిగే రవాణా బంద్‌ను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మంగళవారం కొత్తగూడెం జిల్లా కేంద్రం బస్టాండ్ సెంటర్లో ప్రభుత్వాల దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోటారు వాహనాల చట్టం 2019, తీసుకువచ్చిందని, సేఫ్టీ పేరు చెప్పి భారీ చలాన్లు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకురావడం జరిగిందని, మోటార్ కార్మికుల నడ్డి విరిచి వేలాది, లక్షలాది రూపాయల పెనాల్టీలు ఈ చట్టంలో పొందుపరిచి, మోటార్ కార్మికుల బతుకులపై పెనుభారం మోపిందన్నారు. రోజుకు రూ.50 పెనాల్టీ విధానాన్ని రద్దు చేసి రవాణా రంగ కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గుత్తుల సత్యనారాయణ, కంచర్ల జమలయ్య, డి.వీరన్న, కాలం నాగభూషణం, సురేందర్, పిట్టల రాంచందర్, భూక్య రమేష్, రింగ్ వెంకటయ్య, బత్తుల సత్యనారాయణ, జోస్సప్, దేవరపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.