Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నరేష్
నవతెలంగాణ-జూలూరుపాడు
మండల పరిధిలోని గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నరేష్ విమర్శించారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ 57 ఏండ్లకు పెన్షన్ ఇస్తానన్న కేసీఆర్ హామీకి ఏడున్న ఏండ్లు అయినా ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయకపోగా వచ్చే పింఛను నెలవారీగా ఇవ్వలేక పోతున్నారని అన్నారు. గ్రామాల్లో సమస్యలు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. సమస్యల పరిష్కారం పోరాటమే మార్గమని తెలిపారు.