Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం డిమాండ్
నవతెలంగాణ-భద్రాచలం
తునికాకు కార్మికులకు ఆన్లైన్ పేమెంట్‌లో కాకుండా నేరుగా నగదు రూపంలో పేమెంట్లు చేయాలని, పెండింగ్ బోనస్ వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి సరియం కోటేశ్వరరావులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాచలం నియోజకవర్గ తునికాకు కల్లేదారుల సదస్సు మంగళవారం మురళి అధ్యక్షతన కామ్రేడ్ చందర్రావు భవనంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తునికాకు సేకరిస్తున్న కార్మికులకు చెల్లిస్తున్న పేమెంట్లను గతంలో మాదిరిగా నగదు రూపంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ పేమెంట్ల వల్ల కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు అన్నారు. తునికాకు కార్మికులుకు చెల్లించ వలసిన పెండింగ్ తునికాకు బోనస్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న కాలంలో వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్య క్షులు గడ్డం స్వామి, గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కారం పుల్లయ్య ,పట్టణ అధ్యక్షులు జోగారావు, కల్లేదారుల సంఘం నాయకులు కొమరం వెంకటేశ్వర్లు, సొంది లోకేష్, తదితరులు పాల్గొన్నారు.