Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-పాల్వంచ
జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినాన్ని పండుగలా జరుపుకోవాలని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు అన్నారు. పాత పాల్వంచలోని వనమా స్వగృహంలో మంగళవారం టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.
ప్రతి కార్యకర్త తమ తమ ప్రాంతాల్లో కేసీఆర్ గొప్పదనాన్ని చాటుతూ ఫ్లెక్సీలు కట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ కొత్వాల శ్రీనివాసరావు, జెడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, ఎంపీపీ మడివి సరస్వతి, పెద్దమ్మ గుడి చైర్మన్ మహీపతి రామలింగం, సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, టీఆర్ఎస్ అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్, మండల అధ్యక్షులు శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.