Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చంద్రుగొండ
అర్హులైన షెడ్యూల్డ్ కులాల పేదవారికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి రాయి రాజా డిమాండ్ చేశారు. చండ్రుగొండ వైయస్సార్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రాయి రాజా మాట్లాడుతూ ఏజెన్సీ చట్టాలకు కేవీపీఎస్ వ్యతిరేకం కాదని, దళితులకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి 170 చట్టాన్ని సాకుగా చూపడం సబబు కాదని, సొంత ఇల్లు స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు మంజూరు చేయాలని, దళిత బంధు ప్రతి పేదవాడికి ఇవ్వాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల నాయకులు దాసరి సీతారా ములు, వృత్తి సంఘం నాయకులు విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, యోహాను, సుభద్ర, సుజాత, కళ్యాణి, వెంకటమ్మ, పార్వతి తదితరులు పాల్గొన్నారు.