Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-ములకలపల్లి
ధరణి పోర్టల్ సమస్యలను పరిష్కరించి, వెంటనే పట్టా దారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన ములకలపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్ధాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో వారస్వతం, క్రయ, విక్రయాల సమస్యలను వెంటనే పరిష్కరించి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని అన్నారు. రైతులు పండించిన పంటకు స్వామినాథన్ సిఫార్సు ప్రకారం గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రూ.లక్ష రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, పంట ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని అన్నారు. దళారుల వ్యవస్థ రద్దు చేసి రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జీడిమామిడి గింజలకు మద్దతు ధర క్వింటాకు రూ.15వేలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల దరఖాస్తులు తీసుకుని 6 నెలలు గడుస్తున్నా నేటికి దరఖాస్తులు పరిశీలించకుండా తాత్సారం చేయడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే పోడు భూముల దరఖాస్తులను పరిశీలించి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు సాగు దారులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోడు సాగుదారులపై ఫారెస్టు అధికారులు దాడులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం కోసం కుట్రపూరితమైన చర్యలు తీసుకుంటూ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తి వేయాలన్న ప్రయత్నం తక్షణమే మానుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఉపాధి హామీ క్యూబిక్ మీటర్ సంబంధం లేకుండా రోజు కూలీ రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కొక్కెరపాటి పుల్లయ్య, కొండపల్లి శ్రీధర్, అశ్వారావుపేట కార్యదర్శి బి.చిరంజీవి, ములకలపల్లి కార్యదర్శి ముదిగొండ రాంబాబు, పిట్టల అర్జున్, దమ్మపేట కార్యదర్శిమోరంపుడి శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.