Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వాపురం
మండల పరిధిలోని మొ ండికుంట గ్రామపంచాయతీలో సైడు కాలువల అభివృద్ధి పనుల కు మంగళవారం ఎంపీపీ ముత్తినేని సుజాత శంకుస్థాప నలు చేశారు. మండల పరిషత్ నుండి మంజూరైన రూ.ఏడు లక్షలను కాలువల పనులకు కేటాయి ంచారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా తాము పని చేస్తున్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ప్రభుత్వం పల్లెల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి జిల్లా, మండల కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ షరీఫ్ ఉద్దీన్, ఏస్.కె.ఖదీర్, నెల్లిపాక పీఏసీఎస్ చైర్మన్ తుక్కాని మధుసూదన్ రెడ్డి, ఎంపీటీసీ కమటం నరేష్, వార్డు మెంబర్ పాల్గొన్నారు.