Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
లయన్స్ క్లబ్ మణుగూరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో 2022-23 సంవత్సరంనకు గాను నూతన కార్యవర్గంని ఎన్నుకున్నారు. మంగళవారం జరిగిన ఈ సమావేశానికి లయన్స్ క్లబ్ మణుగూరు ప్రెసిడెంట్ నాగేశ్వరరావు అధ్యక్షత వహించి, రాబోయే కార్యవర్గం ఎన్నిక సంబంధించి చర్చను ప్రారంభించారు. ప్రెసిడెంట్గా దండా రాధాకృష్ణ, జనరల్ సెక్రటరీ భూక్యా తార, కోశాధికారి వల్లభనేనీ నాగేశ్వరరావులను క్లబ్ వ్యవస్థాపకులు పిళ్ళారిశెట్టి హరిబాబు ప్రతిపాదించగా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సంధర్బంగా కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను క్లబ్ సభ్యులు, శాలువా, పూల బొకేలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గాజుల పూర్ణ చందర్ రావు, ట్రెజరర్ తార, డీసీ గాజుల రమేష్ కుమార్, ఫాస్ట్ జోన్ చైర్మన్ బెటంచర్ల వెంకటేశ్వర రావు, ఫాస్ట్ ప్రెసిడెంట్ తారప్రసాద్, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.