Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి డైరెక్టర్ (పా) ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్.బలరామ్
నవతెలంగాణ-కొత్తగూడెం
దేశంలోని వివిధ పరిశ్రమలకు ఉన్న బొగ్గు డిమాండ్‌కు తగినంత బొగ్గు ఉత్పత్తి చేసి, సకాంలో రవాణా చేసి సమయానికి వినియోగదారులకు అందిస్తున్నామని, దేశంలో బొగ్గుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, దానికి అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నామని సింగరేణి బొగ్గును నమ్ముకొని నడుస్తున్న విద్యుత్, సిమెంట్, ఫార్మా కంపెనీలకు సమయానికి బొగ్గు అందించి వాటి మనుగడ కొనసాగేలా సంస్థ కృషి చేస్తుందని సింగరేణి డైరెక్టర్(పా) ఫైనాన్స్ ఎన్. బలరాం స్పష్టం చేశారు. మంగళవారం కొత్తగూడెం సింగరేణి గెస్ట్ హౌస్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి, రవాణ, వార్షిక సమీక్ష వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2011 సంవత్సరం నుండి ఈ సంస్థ వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుని దేశంలోని విద్యుత్తు, సిమెంట్, ఫార్మా కంపెనీలకు సరఫరా చేస్తున్నామని తెలిపారు. నేడు దేశంలో బొగ్గుకు డిమాండ్ విపరీతంగా ఉందని తెలిపారు. 2020- 21 ఆర్థిక సంవత్సరంలో 50.58 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించామని, రూ.272.64 కోట్ల లాభాలు సింగరేణి కార్మికులు 29 శాతం వాటాగా అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా రూ.79.06 కోట్ల కార్మికులకు చెల్లించామన్నారు. తెలంగాణలోపెద్ద పరిశ్రమ అయిన సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు కుటుంబాల కోసం 7 ప్రధాన ఆసుపత్రులు, 21 డిస్పెన్సరీల ద్వారా వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా 2015 నుండి ఇప్పటి వరకు 13674 మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించామన్నారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ చివరి నాటికి 861 మందికి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. సింగరేణి సంస్థ వ్యాప్తంగా పని చేస్తున్న ఎన్‌సి డబ్ల్యూ కార్మికులకు క్వార్టర్స్ 45659 ఉన్నాయని, ఇందులో ఇప్పటికీ 38340 క్వాటర్స్ కార్మికులకు కేటాయించామని,11388 మంది కార్మికుల ఇండ్లకు ఏసీ సౌకర్యం కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటికే 27288 మంది కార్మికుల గృహాలకు ఏసీ సౌకర్యం కల్పించామని 11052 మంది కార్మికుల గృహాలకు ఏసీ సౌకర్యం త్వరలో దశల వారిగా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. సింగరేణి ప్రభావిత కార్మిక ప్రాంతాల అభివృద్ధి కోసం 2021-22 ఆర్థిక సంవత్సరంలో సిఎస్ఆర్ పాలసీ బడ్జెట్ కింద 44.60 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ నుండి అక్టోబర్ మాసంలో రైలు మార్గం ద్వారా బొగ్గు రవాణా చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇటీవలే రైల్వే అధికారులు ట్రాక్ పరిశీలన చేశారన్నారు. సింగరేణి, రైల్వే శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 53 కిలోమీటర్ల రైలు మార్గం నిర్మించడం జరిగిందన్నారు. సింగరేణి వాటాగా రూ.650 కోట్లు రైలు మార్గానికి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా 50 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని, సింగరేణి వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటేందుకు ''ప్రతి అడుగునా పచ్చదనం...'' పేరుతో మొత్తం మొక్కలు నాటే కార్యక్రమం చేస్తుందన్నారు. కొత్తగూడెం గౌతమి ఓపెన్ కాస్ట్ నుండి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిన నేపథ్యంలో వికె-ఓసి నిర్వహణకు ప్రతిపాదనలు చేయడం జరిగిందని, గత నెల19వ తేదీన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిచేశామని తెలిపారు. దేశాబివృద్ధి లక్ష్యంగా సింగరేణి పనిచేస్తుందని వివరించారు. ఈ విలేకర్ల సమావేశంలో డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్.చంద్రశేఖర్, జిఎంలు కె.బసవ య్య, అందెల ఆనందరావు, పీఓ బేతిరాజు, సుందర్రాజ్, పాస్నైట్ తదితరులు పాల్గొన్నారు.