Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
నవతెలంగాణ-మణుగూరు
మాల్ ప్రాక్టీస్, లీకేజీలకు తావు లేకుండా పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై మంగళవారం ఎంపీడీఓ కార్యాలయం నుంచి విద్య, రెవెన్యూ, పోలీస్, వైద్య, మిషన్ భగీరథ, పంచాయితీరాజ్, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల నిర్వహణకు 75 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 17 పరీక్ష కేంద్రాల్లో పటిష్ట పర్యవేక్షణ అదనపు సిబ్బందిని కేటాయించాలని చెప్పారు. అనంతరం ఏర్పాట్లపై చీప్ సూపర్డెంట్లు, తహసీల్దార్లను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఈఓ సోమశేఖరశర్మ, జెడ్పీ సీఈఓ విద్యా లత , డీఆర్డిఓ మధుసూదనరాజు, డీపీఓ రమాకాంత్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ దయానంద స్వామి, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డిఓ స్వర్ణలత, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.