Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ పిలుపు మేరకు బుధవారం యూఎస్పీసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు షెడ్యూల్ విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేయడం, ఉపాధ్యాయుల మానసిక వేదనకు గురి చేస్తూ సమస్యలను పరిష్కరించకుండా జాప్యం చేయడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమానికి నిర్వహించేందుకు పిలుపు నివ్వడం జరిగిందని, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) నాయకులు పిలుపు నిచ్చారు. ఈ సదర్భంగా వారు మాట్లాడారు. ఏడేళ్లుగా పదోన్నతులు లేక విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం అవుతున్నటువంటి సందర్భంలో ఇటు ఉపాధ్యాయులు అటు విద్యార్థులు నష్టపోతున్న పరిస్థితి నెలకొందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తామని పలుమార్లు ప్రకటనలు చేయడం జరిగిందన్నారు. వాటిని నెరవేర్చలేదని తెలిపారు. షెడ్యూల్ విడుదల చేయకపోవడం వెనక ఉన్న ఆంతర్యమేమిటో చెప్పాలన్నారు. అలాగే 317పై ఉన్న భార్యా, భర్తల బదిలీలు, అప్పీల్స్, పరస్పర బదిలీలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎటూ తేల్చకుండా తాత్సారం చేస్తున్నారు తద్వారా 317 జిఓ పైన పెట్టుకున్న అప్పీల్ తేల్చక పోవడం ద్వారా ఉపాధ్యాయులు ఎక్కడ నివసించాలో తెలియక ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కావున మిత్రులంతా ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. అలాగే ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ)లోని అన్ని భాగస్వామ్య సంఘాల జిల్లా కమిటీ బాధ్యులు, వివిధ మండలాల బాధ్యులు, రాష్ట్ర కౌన్సిలర్లు, సీనియర్ కార్యకర్తలు, ప్రాథమిక సభ్యులు పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు.