Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
మండల పరిధిలోని వెంగన్నపాలెం ఎస్సీ కాలనీలో గత 15 రోజులుగా తాగు నీరు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం కాలనీ వాసులకు తాగు నీరు అందించేందుకు పంచాయతీ సర్పంచ్ గలిగ సావిత్రి ట్యాంకర్‌తో కాలనీ వాసులకు నీళ్లు సరఫరా చేశారు. అయితే అధికారులు నీటి ఎద్దడిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కాలనీ వాసులు మండిపడుతున్నారు. ఈ సమస్యపై కలెక్టర్ స్పందించి, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.