Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీడీఏ పీవోకు వినతి
నవతెలంగాణ-భద్రాచలం
2018వ సంవత్సరంలో భద్రాచలం ఏఏంసీ కాలనీలో ఆదివాసులకు కేటాయించిన డబల్ బెడ్ రూమ్‌లకు కరెంటు మీటరు లబ్ధిదారుల పేర్లు మీద మార్చాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పీిఓ గౌతమ్ పొట్రుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి సోయం జోగారావు, అధ్యక్షత, వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు సున్నం గంగా, కుంజా శ్రీను మాట్లాడుతూ గతంలో ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల పేర్లతో కార్డు గానీ, పట్టాలు గానీ, కరెంటు మీటర్లు గాని లబ్ధిదారులు పేర్లు మంజూరు చేయలేదని పేర్కొన్నారు. వాటిని మంజూరు చేయాలని పట్టణంలో కోట్లాది రూపాయలతో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఏఎంసీ కాలనీవద్ద మనుబోతుల చెరువు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తిచేసి ఇల్లు లేని నిరుపేదలు ఆదివాసులకు అందచేయాలని వారు కోరారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేయకపోవడం, ఉన్న డ్రైనేజీలో మూడు నెలలకు ఒకసారి క్లీన్ చేస్తున్నారని, వీటిని తక్షణమే వారానికి ఒకసారి క్లీన్ చేయాలని వారు పేర్కొన్నారు. వెంటనే కల్వర్టు నిర్మాణం పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుంజా శ్రీను, పట్టణ కార్యదర్శి సోయం జోగారావు, పట్టణ అధ్యక్షులు, ప్రవీణ్ కుమార్, పట్టణ కమిటీ సభ్యులు, సోయం సుబ్బు, నాగమణి, మౌనిక, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.