Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
పాఠశాల అభివృద్ధికి జగన్ వర్గీయులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పట్టణ సమీపం లక్ష్మీదేవి పల్లి పంచాయతీ పరిధిలోగల సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో మరమ్మత్తుల నిర్వహణ కోసం జిల్లా టీఆర్ఎస్ నాయకులు దొప్పలపూడి సురేష్ బాబు ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాల యాజమాన్యానికి రూ.20 వేల నగదుగా అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ పాఠశాలలో సరైన సౌకర్యాలు లేక చిన్నచిన్న మరమ్మతులు నెలకొన్న నేపథ్యంలో సమస్య తమ దృష్టికి రాగా ఈ సహాయంగా అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లమల సత్యం, ఏలూరు రామారావు, వీరం రామచంద్రారెడ్డి, లింగమనేని సంతోష్, బల్లి అనిల్ కుమార్, మహారాణి, సంతోష్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు నాగజ్యోతి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.