Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థి పోరాటాలు ఉధృతం చేయాలి
- మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
నవతెలంగాణ-ఇల్లందు
సామాజిక రుగ్మతలు అంతం చేస్తు అంతరాలు లేని సమాజ నిర్మాణానికై విద్యార్థి పోరాటాలు ఉదృతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) జిల్లా స్థాయి నిర్మాణ జనరల్ బాడీ సమావేశంను స్థానిక జంపాల ప్రసాద్ నగర్ (ఇల్లందు)లో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశాలకి ముందుగా బిగిపిడికిలి జండాను పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు కాంపాటి పృధ్వీ ఆవిష్కరించారు. జిల్లా వైస్ ప్రెసిడెంట్ కె.సంధ్య అమరవీరుల సంతాపం ప్రవేశపెట్టారు. పీడీఎస్యూ జిల్లా నిర్మాణ జనరల్ బాడీ సమావేశాలను గుమ్మడి ప్రారంభోపన్యాసం చేసి ప్రారంభించి, మాట్లాడారు. పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.నాగేశ్వరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగ బలోపేతంలో ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ విద్యార్థి ఉద్యమాలను నిర్మించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ కొత్తగూడెం డివిజన్ అధ్యక్షులు ఎనగంటి వంశీ వర్ధన్, కార్యదర్శి నరేందర్, ఇల్లందు టౌన్ కార్యదర్శి పార్థ సారధి, కోశాధికారి తరుణ్, రాజ్ కుమార్, రవి చంద్ర, గంగరాజు, రంగ, రవీనా, మౌనిష, కావేరి తదితరులు పాల్గొన్నారు.